Monday, July 11, 2016

భారతీయం
-------------------

మతమంటే శాంతి మంత్రం పఠించాలని
నిరంతరం తపనపడుతూ నేను
పర్వదినాలరోజులయినా పదులమందిని
హతమార్చడమే నా అభిమతమంటూ నీవు..
-----------------------------------
భారతీయం-2
-----------------
దేశీయముద్ర వుండాలని
 కేంద్రంలోవారి  తపన
విదేశీమోజుల ఊరేగింపులో
రాష్ట్ర నేత మధనం
========================
భారతీయం-3
-------------------------

ఇప్పుడు దేశవ్యాప్తంగా
కన్నపిల్లలందరికీ
కళ్యాణయోగం సంప్రాప్తించింది..
స్మార్ట్ గాడ్జెట్స్ తో
నిరంతర పాణిగ్రహణంవలన

అది అక్షరాలా రుజువయ్యింది..
--------------------------------------------------

భారతీయం-4
---------------------
పక్షుల కిల కిలారవాలతో
ప్రభాతం పురుడుపోసుకుంటుంది..
గూడుకు క్షేమంగా చేరే గువ్వల రాకతో
సాయంత్రం దిగులు మాని, నవ్వుకుంటుంది..
-------------------------------------------------------
భారతీయం-5
-----------------
ఉగ్రవాదులు
ఆ మతం వారుకాదని కొందరు
ఉగ్రవాదులంతా వారేనని మరికొందరు
యేదేమైనా ఉగ్రవాదాన్ని

నిరోధించవలసింది మాత్రం ఆ ఇద్దరే గదా!!
========================================
భారతీయం-6
-----------------
అతడు కమ్మ్యూనిస్టు
ఇతడు కమ్మ్యూనలిస్టు
మనకు ఎందుకొచ్చిన రొస్టు
వారిని గురించి తలంచడమే శుద్ధ వేస్ట్
==================================

భారతీయం-7
-- -- -- -------- అశాశ్వతమైన జీవితాలకు శాశ్వతమైన విదేశా[హా] అనుభూతి.. పొరుగింటిపుల్లకూర బహురుచి స్వాములకైనా ఆసాములకైనా..
========================
భారతీయం-8
=======================

మొన్నటికి మొన్న దాకా  మనది 'విశాలాంధ్ర '
నిన్న గాక మొన్ననేమొ అసూయంపశ్యగా 'విద్వేషాంధ్ర '
ఏతావాతా మొత్తం మీద అటు తిరిగీ ఇటు సాగీ
రాజధాని కొత్తగా నిర్మాణంలో
 కుదురుగానేమొ  'విదేశాంధ్ర..'
============================
భారతీయం-9
====================
అధికార సిం హాసనంకొరకు
అడ్దదార్లన్నింటినీ సులువుగాతొక్కేస్తారు..
'దిగ్విజయంగా' తప్పులుజేస్తూ  చివరకు
బూడిద మిగిలిందని వాపోతారు..
---------------------------------------
భారతీయం-12
---------------------
పరిణతి గలిగిన నేత
అంటూండే చెంచాల
పొగడ్తలను నమ్మకండి..
చట్టసభలో నిదురించే నేతలను
ససేమిరా మేల్కొల్పకండి..
పప్పుసుద్ద ప్రధాని
మన కర్మగాలి అయితే
ఆ పాపాన్ని తలొంచి భరించకండి..

No comments:

Post a Comment