Wednesday, June 29, 2016

పంటపొలంలో ఏకాకిగా నిలబడ్ద
చెట్టునుచూసి వెక్కి వెక్కి ఏడ్చేసాను..
దిష్టి బొమ్మలా వున్నదని దానిని
కుఠారంతో నరకని రైతు హృదయాన్ని
మెచ్చుకోకుండా వుండలేకపోయాను..
---------------------------------------రావెల 

Monday, June 27, 2016

అవాజ్మానసగోచరుడు..
--------------------------రావెల

సుప్రభాతాన్నే సూర్యుడు
ఉదయకిరణాలు విరజిమ్మడం
మొదలెట్టకముందే అతడూ ఠంచనుగా
పచ్చిక బయలుకు కాలినడకను సాగిస్తాడు..

అక్కడ అప్పుడె నోరుతెరుచుకున్న పూలమొక్కలతో
అనురాగ విలసితంగా ఆప్యాతను కుమ్మరిస్తూ
పలకరింపుల ప్రస్థానం సాగిస్తాడు..

కొంచం పొద్దెక్కుతుండగా ఇంటిదగ్గరలో
జలజలా ప్రవహించే సెలయేరుతోగగలా
మాట్లాడేసి ఇంటికి తికి తీరీగి వస్తాడు..

సాయంత్రం కాస్త చల్లబడగానే ఊరుముందర చెరువు
దగ్గరకు చేరుకుని ఇంటిబాటపట్టివచ్చిన పక్షులతో
సంభాషణలను కొనసాగిస్తూ గొంతుకలిపి కొన్ని రాగాలను
అందుకుని ఆనందపడుతుంటాడు..
చీకటిపడుతుందనగానే అరుణారుణకాంతులతో
అస్తమిస్తున్న ఆకాశంలో మారుతున్న రంగులను గుండెలోకి
రవాణాచేసుకుంటూ,  మనసుకు నెమ్మదిని బోధిస్తాడు..
రాత్రి చీకటిపడగానే నక్షత్రాలతోనూ అందమైన చందమామతోనూ
తన అనుభూతులను పాటలరూపంలో పంచుకుని
జనపద హృదయచోరుడై వికసిస్తాడు..

అతడినిచూసిన అందరూ,'మనాదిఏదో ముసురుకుందని ' ఎగతాళిజేస్తూ
ఎకసెక్కాలాడుతూ ఎద్దేవాజేసి ఆయాసపడుతుంటారు..
కానీ కొందరుమాత్రం అతని సౌందర్య రిరంసకు చేతులెత్తి మొక్కుతూ
ప్రకృతిలోలీనమై చరించే అతని అదృష్టాన్నివేనోళ్ళకొనియాడితృప్తిపడుతుంటారు..
----------------------------------------------------------------------------------

Sunday, June 26, 2016

మిణుగురులు--2
-----------------------రావెల

ఆకలి తీర్చలేని
ఆసనాల వొడిలో
యావద్భారతం..
-------------------
యోగ మాయలో
కన్ను తెరిపిడిపడని
పేదరికం
--------------
మనసులోని మాట
కూరగాయల గాయాలు
మానుపుండు పడతాయా?
-------------------------
కాషాయమంటే
కషాయమంటాడేంది
పనిదొరకని వాడు..
------------------------


Friday, June 24, 2016

నేలపైన మా రాకడను
తనువంతా పులకరింతలతో
చాటింపులువేసే తరుసమూహం
మృగ్యమైందని
తలలు పంకించి కూర్చుంటున్నది..
వర్ష రుతుసమూహం
అతివృష్టీ,అనావృష్టుల మధ్యన
అతలాకుతలం చేస్తూ ధరణీతలాన్ని
దయనీయంగా ఏమారుస్తూ వేధిస్తున్నది.